The Bible Software
bible.software2 Chronicles2 Chronicles 13 › 2 Chronicles 13:8

2 Chronicles 13:8

“ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And now ye think to withstand the kingdom of the LORD in the hand of the sons of David; and ye be a great multitude, and there are with you golden calves, which Jeroboam made you for gods.

In Context

7సొలొమోను కొడుకు రెహబాము ఇంకా బాలుడుగా, అనుభవం లేక వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధానికి వెళ్ళారు.”

9మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులనూ లేవీయులనూ వెళ్ళగొట్టి, అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీ కోసం యాజకులను నియమించుకున్నారు గదా? ఒక కోడెనీ ఏడు గొర్రె పొట్టేళ్లనీ తీసుకు వచ్చి తనను ప్రతిష్ఠించుకోడానికి వచ్చే ప్రతివాడూ దేవుళ్ళు కాని వాటికి యాజకుడై పోతున్నాడు గదా.

Read all of 2 Chronicles 13

Cross References

1 Kings 12:29ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే” అని చెప్పి, ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు.

2 Chronicles 9:8నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు” అని చెప్పింది.

2 Chronicles 14:9ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకూ వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు.

2 Chronicles 20:12మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు.

Psalms 33:16ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు. 1

Isaiah 9:6ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Chronicles 13:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Chronicles 13:72 Chronicles 132 Chronicles 13:9 →