The Bible Software
bible.software2 Chronicles2 Chronicles 13 › 2 Chronicles 13:9

2 Chronicles 13:9

మీరు అహరోను సంతానమైన యెహోవా యాజకులనూ లేవీయులనూ వెళ్ళగొట్టి, అన్యదేశాల ప్రజలు చేసినట్టు మీ కోసం యాజకులను నియమించుకున్నారు గదా? ఒక కోడెనీ ఏడు గొర్రె పొట్టేళ్లనీ తీసుకు వచ్చి తనను ప్రతిష్ఠించుకోడానికి వచ్చే ప్రతివాడూ దేవుళ్ళు కాని వాటికి యాజకుడై పోతున్నాడు గదా.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Have ye not cast out the priests of the LORD, the sons of Aaron, and the Levites, and have made you priests after the manner of the nations of other lands? so that whosoever cometh to consecrate himself with a young bullock and seven rams, the same may be a priest of them that are no gods.

In Context

8“ఇప్పుడు దావీదు సంతతి వశంలో ఉన్న యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు కూడా మీ దగ్గర ఉన్నాయి.

10అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు. లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు.

Read all of 2 Chronicles 13

Cross References

Exodus 29:35నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటి ప్రకారం నువ్వు అహరోనుకు, అతని కొడుకులకూ జరిగించాలి. ఏడు రోజుల పాటు వాళ్ళను సేవా ప్రతిష్ట కోసం సిద్ధపరచాలి.

Leviticus 8:2“నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకు రా. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలూ, అభిషేకం చేయడానికి నూనే, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దూ, రెండు పొట్టేళ్ళూ, పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలూ తీసుకు రా.

Deuteronomy 32:17వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. 1 తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, 1 మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు. 1

1 Kings 13:33ఇది జరిగిన తరువాత కూడా యరొబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరో సారి సాధారణ మనుషులను ఉన్నత పూజాస్థలాలకు యాజకులుగా నియమించాడు. పూజ చేయడానికి ఇష్టపడిన వారందరినీ యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత పూజా స్థలాలకు యాజకులుగా నియమించాడు.

1 Chronicles 29:5ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు.

Jeremiah 2:11దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study 2 Chronicles 13:9

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← 2 Chronicles 13:82 Chronicles 132 Chronicles 13:10 →