2 Chronicles 16:7
ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. “నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Kings 16:1యెహోవా బయెషాను గురించి హనానీ కొడుకు యెహూతో ఇలా చెప్పాడు,
2 Kings 18:5అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వికులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు.
2 Chronicles 13:18ఈ విధంగా ఇశ్రాయేలు వారు ఆ కాలంలో అణిగిపోయారు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణంగానే విజయం సాధించారు.
2 Chronicles 20:32అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.
2 Chronicles 32:7“ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. అష్షూరురాజు గురించి గానీ అతనితో ఉన్న సైన్యమంతటి గురించి గానీ మీరు భయపడవద్దు, హడలిపోవద్దు. అతనితో ఉన్న వాడి కంటే మనతో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు.
Isaiah 31:1“ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి పట్టించుకోకుండా, ఆలోచన కోసం యెహోవా దగ్గరకి వెళ్ళకుండా 1 సహాయం కోసం ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళకీ, గుర్రాలపై ఆధార పడేవాళ్ళకీ, 1 అసంఖ్యాకంగా ఉన్న వాళ్ళ రథాలపైనా, లెక్కకు మించిన రౌతుల పైనా నమ్మకం ఉంచే వాళ్ళకీ బాధ! 1