2 Chronicles 20:28
వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they came to Jerusalem with psalteries and harps and trumpets unto the house of the LORD.
In Context
29ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు.
Cross References
1 Chronicles 13:8దావీదూ, ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణశక్తితో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ, తీగ వాయిద్యాలు, తంబురాలు, కంచు తాళాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ ఉన్నారు.
1 Chronicles 25:6వీళ్ళందరూ ఆసాపుకూ, యెదూతూనుకూ, హేమానుకూ, రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు.
Psalms 92:3పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది. 1
Psalms 149:3వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక. 1
Revelation 14:2అప్పుడు విస్తారజలం పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.