2 Chronicles 30:22
యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
23సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు.
Cross References
Deuteronomy 26:3ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరికి వెళ్లి “యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈ రోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను” అని అతనితో చెప్పాలి.
2 Chronicles 15:3చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి.
2 Chronicles 32:6ప్రజల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణ గుమ్మం దగ్గర ఉన్న విశాల స్థలం దగ్గరికి వారిని రప్పించి వారిని ఇలా హెచ్చరించాడు.
Ezra 7:10ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను, ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు. 1 ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం
Ezra 10:11కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
Nehemiah 8:18అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.