bible.software › 2 Chronicles › 2 Chronicles 30 › 2 Chronicles 30:23
2 Chronicles 30:23
సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the whole assembly took counsel to keep other seven days: and they kept other seven days with gladness.
In Context
22యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.
24యూదా రాజు హిజ్కియా, సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలూ మేకలూ ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు.
Read all of 2 Chronicles 30
Cross References
1 Kings 8:65ఆ సమయంలో సొలొమోను, అతనితో కూడ ఇశ్రాయేలీయులంతా హమాతు పట్టంకు పోయే దారి మొదలు ఐగుప్తు నది వరకూ ఉన్న ప్రాంతాలన్నిటి నుండి వచ్చిన ఆ మహా జన సమూహం రెండు వారాలు, అంటే 14 రోజులు యెహోవా సన్నిధిలో పండగ చేశారు.
2 Chronicles 29:30దావీదూ, దీర్ఘ దర్శి ఆసాపూ, రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా, అధికారులూ లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందంతో స్తుతి గానం చేసి, తలవంచి ఆరాధించారు.
This Verse In Other Editions
Study 2 Chronicles 30:23