2 కొరింతీ పత్రిక 6:18
“నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, 1 మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు” అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And will be a Father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty.
In Context
Read all of 2 కొరింతీ పత్రిక 6
Cross References
Genesis 17:1అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.
2 Samuel 7:14అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.
Isaiah 43:6‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘అడ్డగించ వద్దు’ అని దక్షిణదిక్కుకు ఆజ్ఞాపిస్తాను. 1 దూర ప్రాంతాల నుండి నా కుమారులను, భూమి అంచుల నుండి నా కుమార్తెలను తెప్పించు. 1
Jeremiah 31:1యెహోవా వాక్కు ఇదే. “ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశం వారందరికీ దేవుడుగా ఉంటాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు.”
Hosea 1:9యెహోవా ఇలా చెప్పాడు. “వీడికి ‘లో అమ్మీ + 1:9 లో అమ్మీ నా జనం కానిది’ అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను.
Romans 8:14దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.