2 Samuel 16:4
అప్పుడు రాజు “మెఫీబోషెతుకు కలిగినదంతా నీకే దక్కుతుంది” అని సీబాతో చెప్పినప్పుడు సీబా “నా ఏలికవైన రాజా, నాపై నీ కనికరం నిలిచి ఉంటుంది గాక. నీకు ఇవే నా నమస్కారాలు” అన్నాడు. 1 షిమీ దావీదును శపించడం
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 19:15ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.
2 Samuel 14:4అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది.
2 Samuel 14:10రాజు “ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు” అని ఆమెతో చెప్పాడు.
Proverbs 18:13సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.
Proverbs 19:2ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు.