2 సమూ 19:43
ఇశ్రాయేలువారు “రాజులో మాకు పది వంతులు ఉన్నాయి. దావీదులో మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజును తీసుకువచ్చే విషయం గురించి మీతో ముందుగా మాట్లాడినది మేమే గదా” అని యూదావారితో అన్నారు. యూదావారు ఇశ్రాయేలువారి కంటే కఠినంగా మాట్లాడారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Judges 9:23దేవుడు అబీమెలెకుకు, షెకెము నాయకులకు వైరం కలిగించే దురాత్మను వాళ్ళ మీదికి పంపాడు. అప్పుడు షెకెము నాయకులు అబీమేలెకుతో తమకున్న ఇప్పండం విషయంలో ద్రోహం చేశారు.
2 Samuel 5:1ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలవారు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. వారు “రాజా, విను. మేమంతా నీకు దగ్గర బంధువులం.
2 Samuel 19:14అతడు వెళ్లి యూదా వారిలో ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా రాజుకు లోబడేలా చేశాడు. యూదావారు రాజు దగ్గరికి “నువ్వు, నీ సేవకులంతా తిరిగి రావాలి” అన్న కబురు పంపించారు. రాజు బయలుదేరి యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు
2 Samuel 20:6అప్పుడు దావీదు అబీషైని పిలిపించాడు. “బిక్రి కొడుకు షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు. వాడు ఎత్తయిన గోడలు గల పట్టణాల్లో దాక్కుని మనకు దొరకడేమో. కాబట్టి నీవు నా సేవకులను వెంటబెట్టుకుని వెళ్లి వాడిని తరిమి పట్టుకో” అని ఆజ్ఞాపించాడు.
1 Kings 12:16కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: 1 “దావీదు వంశంతో మాకేం సంబంధం? 1 యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? 1 ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. 1 దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
Proverbs 15:1సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.