The Bible Software
ఆమోసు · బైబిల్ (తెలుగు)

ఆమోసు 1

1ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు.

2అతడు ఇలా చెప్పాడు, “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.” 1 జాతుల పై తీర్పు

3యెహోవా చెప్పేదేమిటంటే, “దమస్కు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండాా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు.

4నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది.

5దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను. బికత్ ఆవెనులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. బెత్ ఏదేనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఆరాము ప్రజలు బందీలుగా కీరు ప్రాంతానికి వెళ్తారు.” అని యెహోవా చెబుతున్నాడు.

6యెహోవా చెప్పేదేమిటంటే, “గాజా మూడుసార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోము వారి వశం చేశారు.

7గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది.

8అష్డోదులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. అష్కెలోనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఎక్రోనుకు విరోధంగా నా చెయ్యి ఎత్తుతాను. ఇంకా మిగిలిన ఫిలిష్తీయులు నాశనమవుతారు” అని యెహోవా ప్రభువు చెబుతున్నాడు.

9యెహోవా చెప్పేదేమిటంటే, “తూరు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమూహాలన్నిటినీ ఎదోముకు అప్పగించారు. వాళ్ళు సోదర భావంతో చేసుకున్న నిబంధనను తెగతెంపులు చేసుకున్నారు.

10నేను తూరు ప్రాకారాల మీదికి అగ్ని పంపిస్తాను. అది దాని రాజ భవనాలను దహించి వేస్తుంది.”

11యెహోవా చెప్పేదేమిటంటే, “ఎదోము మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాడు జాలి చూపకుండా కత్తి పట్టుకుని తన సోదరులను తరిమాడు. అతని కోపం ఎప్పుడూ రగులుతూనే ఉంది. అతని ఆగ్రహం ఎప్పటికీ నిలిచే ఉంది.

12తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.”

13యెహోవా చెప్పేదేమిటంటే, “అమ్మోనీయులు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే తమ సరిహద్దులను ఇంకా విశాలం చేసుకోవాలని వారు గిలాదులోని గర్భవతుల కడుపులు చీల్చారు.

14రబ్బా ప్రాకారాలను కాల్చేస్తాను. యుద్ధ ధ్వనులతో, సుడి గాలి వీచేటప్పుడు కలిగే ప్రళయం లాగా అది రాజ భవనాలను దహించివేస్తుంది.

15వారి రాజు, అతని అధిపతులందరూ బందీలుగా దేశాంతరం పోతారు” అని యెహోవా చెబుతున్నాడు.

← యోవేలు 3Read In The App, Free →ఆమోసు 2 →

Study ఆమోసు 1

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789