ఆమోసు 3:11
కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. 2 అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. 2 నీ రాజ భవనాలను దోచుకుంటాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 15:19అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మెనహేము, తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు.
2 Kings 17:3అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.
2 Chronicles 36:19వారు దేవుని మందిరాన్ని తగలబెట్టి, యెరూషలేము గోడలను పడగొట్టారు. దాని భవనాలన్నిటినీ కాల్చివేశారు. దానిలోని అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేశారు.
Isaiah 7:17యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. 1 ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు. 1
Isaiah 10:5అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర. 1
Hosea 11:5ఐగుప్తు దేశానికి వారు మళ్ళీ తిరిగి పోరా? నా దగ్గరకి తిరిగి రావడానికి నిరాకరించినందుకు అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయడా?