Amos 5:17
ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది. 2 ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.” 1 యెహోవా తీర్పు దినం
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in all vineyards shall be wailing: for I will pass through thee, saith the LORD.
In Context
Cross References
Exodus 12:12నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో + 12:12 ఐగుప్తు దేవుళ్ళు అందరూ నిజమైన దేవుళ్ళు కారని రుజువు చేస్తాను.తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను.
Isaiah 16:10ఆనంద సంతోషాలు ఫలభరితమైన పొలాల నుంచి అదృశ్యం అవుతాయి. నీ ద్రాక్షల తోటలో సంగీతం వినిపించదు. ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్షగెలలను తొక్కేవాడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కేవారి సంతోషభరితమైన కేకలు నేను నిలుపు చేశాను. 1
Jeremiah 48:33కాబట్టి మోయాబు దేశంలో నుండి పళ్ళ చెట్ల మూలంగా కలిగే సంతోషమూ, సంబరమూ తొలగిపోయాయి. 1 ‘వాళ్ళ ద్రాక్ష గానుగల్లో ద్రాక్షారసానికి నేను ముగింపు పలికాను. వాళ్ళు గానుగలో ద్రాక్షలు తొక్కేటప్పుడు ఆనందంతో కూడిన కేకలు వినిపించవు. వినిపించే కేకల్లో ఆనందం ఉండదు.
Joel 3:17మీ యెహోవా దేవుణ్ణి నేనే, 1 నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. 1 అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. 1 వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.
Nahum 1:15శాంతి సందేశం ప్రకటిస్తూ, సమాధాన శుభ సమాచారం బోధించే వారి పాదాలు పర్వతాల మీద కనిపిస్తున్నాయి. యూదా ప్రజలారా, మీ ఉత్సవాలు జరుపుకోండి. మీ మొక్కుబళ్ళు చెల్లించండి. ఇప్పటి నుండి దుర్మార్గుడు దండెత్తి మీ మధ్యకు రాడు. వాడు సమూలంగా నాశనం అయ్యాడు.