Daniel 3:8
అప్పుడు జ్యోతిష్యుల్లో ముఖ్యులు కొందరు వచ్చి యూదులపై నిందలు మోపారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Wherefore at that time certain Chaldeans came near, and accused the Jews.
In Context
9నెబుకద్నెజరు రాజు దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “రాజు కలకాలం జీవించు గాక.
Cross References
Ezra 4:12మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి, పునాదులు బాగు చేస్తున్నారు.
Esther 3:8అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా చెప్పాడు. “మీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి ప్రజలు అక్కడక్కడా నివసిస్తున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వ్యతిరేకం. వారు రాజాజ్ఞలు పాటించరు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు శ్రేయస్కరం కాదు.
Daniel 6:12రాజు సన్నిధికి వచ్చి రాజు నియమించిన శాసనం విషయం ప్రస్తావించారు. “రాజా, 30 రోజుల వరకూ నీకు తప్ప మరి ఏ దేవునికైనా, మానవునికైనా ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసినట్టైతే వాడిని సింహాల గుహలో పడవేస్తామని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు గదా” అని అడిగారు. రాజు “మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనం. దాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు” అని చెప్పాడు.
Acts 16:20న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి
Acts 28:22అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు.