Daniel 8:3
నేను ఊలయి అనే నది ఒడ్డున ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది. నేను కళ్ళెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ఒడ్డున నిలబడి ఉంది. దానికి రెండు కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు పొడవుగా ఉన్నాయి. అయితే ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్నది తరువాత మొలిచింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Joshua 5:13యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు.
Ezra 1:2“పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
Esther 1:3తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు.
Isaiah 21:2దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది. 1 మోసగాడు మోసాలు చేస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. 1 ఏలాము దేశమా, వెళ్ళి దాడి చెయ్యి, మాదియా దేశమా ముట్టడి వెయ్యి. 1 నేను ఆమె మూలుగులను ఆపివేస్తాను. 1
Jeremiah 51:11బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. 1 బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. 1 అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన. 1
Daniel 5:31అరవై రెండు సంవత్సరాల వయసున్న మాదీయ రాజు దర్యావేషు సింహాసనం అధిష్టించాడు.