Daniel 9:18
నీ మహా కనికరాన్ని బట్టి మాత్రమే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము గాని మా సొంత నీతి కార్యాలను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవా, ఆలకించు. నీ కళ్ళు తెరచి, నీ పేరు పెట్టిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనాన్ని, నీ పేరు పెట్టిన ఈ పట్టణాన్ని తేరి చూడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 6:27ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”
2 Kings 19:16యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు.
Psalms 25:6యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి. 1
Isaiah 37:17సేనల ప్రభువైన యెహోవా, నీ కళ్ళు తెరచి చూసి నా మాటలు ఆలకించు. జీవం గల దేవుడవైన నిన్ను దూషిస్తూ సన్హెరీబు రాసిన మాటలు విను.
Isaiah 63:15పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. 1 నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? 1 మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి. 1
Isaiah 64:6మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి. 1 మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం. 1