Deuteronomy 28:25
యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
26నీ శవం అన్ని రకాల పక్షులకూ, క్రూర మృగాలకూ ఆహారమవుతుంది. వాటిని బెదిరించే వాడెవడూ ఉండడు.
Cross References
Leviticus 26:36మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోడానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరుమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు.
Deuteronomy 32:30వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, 1 యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, 1 ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? 1 పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? 1
Isaiah 30:17మీలో మిగిలి ఉన్న వాళ్ళు ఏదో పర్వతంపై ఒక జెండా కర్రగానో, లేదా ఏదో కొండపై జెండా గానో మిగిలే దాకా మీరు ఒక్కడికి భయపడి వెయ్యి మంది పారిపోతారు. ఐదుగురి భయం చేత మీరంతా పారిపోతారు. 1
Jeremiah 24:9వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.
Jeremiah 34:17కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.
Hosea 8:3కానీ ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు. కాబట్టి శత్రువు వారిని తరుముతాడు.