Deuteronomy 33:29
ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! 1 యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? 1 ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, 1 ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. 1 నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు 1 నువ్వు వారి + 33:29 వీపులనుఎత్తయిన స్థలాలను తొక్కుతావు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 23:20చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది. దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.
Deuteronomy 4:7ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు?
Joshua 10:24వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
2 Samuel 7:23నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు.
Psalms 7:12ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. 1
Psalms 18:45తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు. 1