Deuteronomy 7:3
మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 6:2దైవ కుమారులు + 6:2 పరలోక ఆత్మలు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.
Exodus 34:15ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి.
Joshua 23:12అయితే మీరు వెనక్కి తగ్గి మీమధ్య మిగిలి ఉన్న ఈ రాజ్యాల ప్రజలతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకుని, పరస్పర సంబంధాలు కలిగించుకుంటే
1 Kings 11:2“ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవుళ్ళవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.” అయితే సొలోమోను ఈ స్త్రీలను మోహించాడు.
Ezra 9:1ఈ విషయాలన్నీ ముగిసిన తరువాత పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు అందరూ కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల, అమోరీయుల జాతి ప్రజల నుండి తమను తాము ప్రత్యేకపరుచుకోకుండా ఆ జాతుల ప్రజలు చేస్తున్న అసహ్యకరమైన చెడ్డ పనులు వారు కూడా చేస్తున్నారు.
Ezra 9:12అందువల్ల మీరు మీ కూతుళ్ళను వారి కొడుకులకు, వారి కూతుళ్ళను మీ కొడుకులకు ఇచ్చి పుచ్చుకోకండి. వాళ్లకు క్షేమం, సుఖ సౌఖ్యాలు కలగాలని ఎన్నడూ కోరుకోవద్దు. ఇలా చేసినట్టైతే మీరు స్థిరంగా నిలిచి, ఆ దేశ సుఖాలు అనుభవించి, మీ పిల్లలకు శాశ్వతంగా నిలిచి ఉండే వారసత్వం అప్పగిస్తారు.