Ecclesiastes 2:21
ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
20కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.
22సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది?
Cross References
2 Chronicles 31:20హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు.
2 Chronicles 34:2అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు.
2 Chronicles 36:5యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతడు 25 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 11 ఏళ్ళు పాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.
Psalms 49:11వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు. 1
Ecclesiastes 9:18యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది. 2 ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.
Jeremiah 22:17అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది. 1