Ecclesiastes 4:8
ఒకడు ఒంటరిగా ఉన్నాడు. 2 అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు. 2 అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. 2 ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు. 2 సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు. 2 ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది. 2
9ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది. 2 కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. 2
Cross References
Genesis 2:18దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు.
Psalms 39:6నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే. 1
Proverbs 27:20పాతాళానికి, అగాధానికి తృప్తి ఉండదు. అలానే మనిషి కోరికలకు + 27:20 కోరికలకు కళ్ళు ఎప్పటికీ తృప్తి ఉండదు.
Ecclesiastes 1:13ఆకాశం కింద జరుగుతున్న దాన్ని తెలివిగా వెతికి గ్రహించడంపై నా మనస్సు నిలిపాను. మానవులు నేర్చుకోవడం కోసం దేవుడు వారికి ఏర్పాటు చేసిన పని చాలా కష్టంతో నిండి ఉంది.
Ecclesiastes 4:9ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది. 2 కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. 2
Ecclesiastes 5:10డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు. 2 ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు. 2 ఇది కూడా నిష్ప్రయోజనమే. 2