Exodus 15:8
నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి. ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి. 1 సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 14:22సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి.
Joshua 3:13సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.”
2 Samuel 22:16యెహోవా యుధ్ధ ధ్వనికి 1 ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి 1 భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. 1
Psalms 78:13ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు. 1
Isaiah 37:7అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను. అతడు ఒక పుకారు విని తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని దేశంలోనే కత్తివాత హతం అవుతాడు.”
2 Thessalonians 2:8అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు.