Exodus 2:11
మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
Cross References
Exodus 1:11అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు.
Exodus 5:9అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు” అన్నాడు.
Isaiah 58:6నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, 1 దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, 1 అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం. 1
Luke 4:18“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. 1 పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. 1 చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ, 1
Hebrews 11:24విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు.