Isaiah 58:6
నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, 1 దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, 1 అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 6:5తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.
2 Chronicles 28:11అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది కాబట్టి, మీ సొంత సోదరుల్లోనుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి.”
Nehemiah 5:11ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.”
Jeremiah 34:8యూదాలో తన తోటి ఇశ్రాయేలీయుణ్ణి ఎవరూ దాస్యానికి పెట్టుకోకూడదనీ, తమ దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలను, పురుషులను ప్రతివాడూ విడుదల చెయ్యాలనీ,
Micah 3:2మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. 1 నా ప్రజల చర్మం ఒలిచేసి 1 వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు. 1
1 Timothy 6:1బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి.