యెహెజ్కేలు 1:3
కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున
Cross References
2 Kings 3:15అయితే ఇప్పుడు తీగ వాయిద్యం వాయించగల ఒకణ్ణి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. తీగ వాయిద్యం వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తం ఎలీషా పైకి బలంగా వచ్చింది. అప్పుడు అతడు ఇలా అన్నాడు.
Jeremiah 1:2ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్నప్పుడు అతని పాలనలో 13 వ సంవత్సరం యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమయ్యాడు.
Jeremiah 29:15బబులోనులో యెహోవా మాకు ప్రవక్తలను నియమించాడని మీరు అన్నారు గనుక,
Ezekiel 3:14దేవుని ఆత్మ నన్ను పైకి లేపి తీసుకు వెళ్ళాడు. యెహోవా హస్తం నన్ను తీవ్రంగా బలవంతం చేయడంతో నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనై బయలుదేరాను!
Ezekiel 3:22అక్కడ యెహోవా హస్తం నాపై ఉంది. ఆయన నాతో ఇలా అన్నాడు. “నువ్వు లే, మైదాన ప్రాంతానికి వెళ్ళు. అక్కడ నేను నీతో మాట్లాడుతాను.”
Ezekiel 8:1బబులోను చెరలో ఉన్న కాలంలో, ఆరో సంవత్సరం ఆరో నెల ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. యూదా ప్రజల్లో పెద్దలు నా ఎదుట కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రభువైన యెహోవా హస్తం నా పైకి వచ్చింది.