The Bible Software
bible.software › యెహెజ్కేలు › యెహెజ్కేలు 3 › యెహెజ్కేలు 3:14

యెహెజ్కేలు 3:14

దేవుని ఆత్మ నన్ను పైకి లేపి తీసుకు వెళ్ళాడు. యెహోవా హస్తం నన్ను తీవ్రంగా బలవంతం చేయడంతో నేను తీవ్రమైన ఉద్వేగానికి లోనై బయలుదేరాను!

బైబిల్ (తెలుగు)

In The King James Version

So the spirit lifted me up, and took me away, and I went in bitterness, in the heat of my spirit; but the hand of the LORD was strong upon me.

In Context

13అంటే ఆ జీవుల రెక్కలు ఒక దానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దమూ, ఆ చక్రాలు కదిలినప్పుడు కలిగిన చప్పుడూ, ఒక మహా భూకంపం వచ్చినప్పుడు కలిగే శబ్దమూ నాకు వినిపించాయి.

15అలా నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలానికి వెళ్ళాను. అక్కడ బందీలుగా వచ్చిన కొందరు నివాసముంటున్నారు. అక్కడే నేను ఏడు రోజులు దిగ్భ్రమతో నిండి ఉండిపోయాను.

Read all of యెహెజ్కేలు 3

Cross References

1 Kings 18:12నేను నీ దగ్గరనుండి వెళ్ళిన వెంటనే యెహోవా ఆత్మ, నాకు తెలియని ప్రదేశానికి నిన్ను తీసుకుపోతాడు. అప్పుడు నేను వెళ్లి అహాబుకు కబురు చెప్పిన తరువాత నీవు అతనికి కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. కాబట్టి అలా ఆజ్ఞాపించవద్దు. నీ దాసుడనైన నేను చిన్నప్పటి నుంచి యెహోవాపట్ల భయభక్తులు గలిగిన వాణ్ణి.

2 Kings 2:16వారు అతనితో “నీ సేవకులైన మా దగ్గర యాభై మంది బలమైన వారున్నారు. నీ గురువును వెదకడానికి వాళ్ళను వెళ్ళనివ్వు. ఒకవేళ యెహోవా ఆత్మ అతణ్ణి పైకి తీసుకు వెళ్ళి ఏ పర్వతం మీదనో, ఏ లోయలోనో పడవేసి ఉండవచ్చు” అని మనవి చేశారు. దానికి ఎలీషా “వద్దు, ఎవర్నీ పంపకండి” అని జవాబిచ్చాడు.

Isaiah 8:11తన బలిష్ఠమైన చేతిని నాపై ఉంచి ఈ ప్రజల దారిలో నడవకూడదని యెహోవా ఖండితంగా నాతో చెప్పాడు. 1

Jeremiah 20:7యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. 1

Ezekiel 1:3కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.

Ezekiel 8:1బబులోను చెరలో ఉన్న కాలంలో, ఆరో సంవత్సరం ఆరో నెల ఐదో రోజున నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. యూదా ప్రజల్లో పెద్దలు నా ఎదుట కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రభువైన యెహోవా హస్తం నా పైకి వచ్చింది.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యెహెజ్కేలు 3:14

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యెహెజ్కేలు 3:13యెహెజ్కేలు 3యెహెజ్కేలు 3:15 →