Ezekiel 11:21
అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.” ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Jeremiah 1:16అప్పుడు యెరూషలేము ప్రజలు నన్ను విడిచి అన్యదేవుళ్ళకు ధూపం వేసి, తమ స్వంత చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చేసిన చెడుతనాన్ని బట్టి నేను వారిపై నా తీర్పులు ప్రకటిస్తాను.”
Jeremiah 17:9హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు? 1
Ezekiel 7:3ఇప్పుడు అంతం మీ పైకి వచ్చింది. ఎందుకంటే నా తీవ్ర కోపాన్ని మీ పైకి పంపుతున్నాను. మీ ప్రవర్తనను బట్టి మీకు తీర్పు తీరుస్తాను. తరువాత అసహ్యకరమైన మీ పనుల ఫలితాన్ని మీపైకి పంపుతాను.
Ezekiel 9:10కాబట్టి నా దృష్టిలో వారి కోసం ఎలాంటి కనికరమూ లేదు. నేను వాళ్ళని వదలను. వీటన్నిటి ఫలితాన్ని వాళ్ళ తలల పైకి తెస్తాను.”
Ezekiel 14:3“నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
Ezekiel 20:31ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.