Ezekiel 16:39
వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. నువ్వు కట్టిన గుళ్లను వాళ్ళు కూలదోసి, నువ్వు నిలబెట్టిన బలిపీఠాలను పగల గొట్టి, నీ బట్టలు ఊడదీసి, నీ నగలు లాగేసుకుని నిన్ను నగ్నంగా, బోడిగా చేస్తారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:30నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను.
Isaiah 27:9యాకోబు చేసిన పాపానికి ఈ విధంగా పరిహారం జరుగుతుంది. అది అతడు చేసిన పాప పరిహారానికి కలిగే ఫలం. సున్నపురాతిని చూర్ణం చేసినట్టు అతడు బలిపీఠపు రాళ్ళను చిన్నాభిన్నం చేస్తాడు. అషేరా దేవతా స్తంభాలూ, ధూపం వేసే వేదికలూ ఇక నిలిచి ఉండవు. 1
Ezekiel 16:10బుటాదారీ పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి, నీ పాదాలకు తోలు చెప్పులు తొడిగాను. సన్నని నారబట్టతో నిన్ను చుట్టి, పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.
Ezekiel 16:31నువ్వు ప్రతి వీధి మొదట్లో బలిపీఠాలు, ప్రతి బహిరంగ ప్రదేశంలో గుళ్ళు కట్టి, నిజానికి నువ్వు ఒక వేశ్య చేసినట్టు చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు చేసిన వేశ్యక్రియలకు డబ్బు తీసుకోలేదు!
Ezekiel 23:29ద్వేషంతో వాళ్ళు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితమంతా చెరబట్టి నిన్ను వస్త్రహీనంగా, నగ్నంగా విడిచిపెడతారు. అప్పుడు వ్యభిచారం వల్ల నీకు కలిగిన అవమానం వెల్లడి ఔతుంది. నీ వేశ్యక్రియలు, నీ దుష్ప్రవర్తన వెల్లడి ఔతుంది.
Hosea 2:5వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.