bible.software › Ezra › Ezra 7 › Ezra 7:24
Ezra 7:24
యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ పరిచారకులు, దేవుని మందిరంలో పనిచేసేవారి విషయంలో మా నిర్ణయం ఏమిటంటే, వారిపై శిస్తు గానీ, సుంకం గానీ, పన్ను గానీ విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Also we certify you, that touching any of the priests and Levites, singers, porters, Nethinims, or ministers of this house of God, it shall not be lawful to impose toll, tribute, or custom, upon them.
In Context
23ఆకాశంలో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజ కుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకొనేలా చేసుకోవాలి?
25ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానంతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి.
Read all of Ezra 7
Cross References
Genesis 47:22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు.
Ezra 2:36యాజకుల్లో యేషూవ సంతానమైన యెదాయా వంశం వారు 953 మంది.
Ezra 4:20గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు.
This Verse In Other Editions
Study Ezra 7:24