Ezra 8:33
నాలుగో రోజు వెండి బంగారు పాత్రలను మన దేవుని మందిరంలో యాజకుడైన ఊరియా కొడుకు మెరేమోతు కాటా వేశాడు. అతనితో పాటు ఫీనెహాసు కొడుకు ఎలియాజరు, లేవీ గోత్రికుడైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా అక్కడ ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
32మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడ బస చేశాం.
Cross References
Ezra 2:40లేవీయ గోత్రానికి చెందిన యేషూవ, కద్మీయేలు, హోదవ్యా, అనేవారి వంశం వారు మొత్తం 74 మంది.
Ezra 8:30యాజకులు, లేవీయులు వాటి లెక్క, బరువు సరిచూసుకుని, యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరానికి తీసుకు వెళ్ళడానికి ఆ వెండి బంగారు పాత్రలను, ఇతర సామగ్రిని తీసుకున్నారు.
Nehemiah 3:4వారిని ఆనుకుని హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు బాగుచేశాడు. అతని పక్కన మెషేజబెయేలు మనవడు బెరెక్యా కొడుకు మెషుల్లాము, అతని పక్కన బయనా కొడుకు సాదోకు బాగు చేశారు.
Nehemiah 3:24అజర్యా ఇంటి దగ్గర నుంచి గోడ మలుపు మూల వరకూ మరో భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి + 3:24 బిన్నూయి బవ్వై బాగు చేశాడు.
Nehemiah 10:5హారిము, మెరేమోతు, ఓబద్యా,
Nehemiah 10:10వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను,