Genesis 11:31
తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
30శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
32తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.
Cross References
Genesis 11:26తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
Genesis 12:4యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.
Genesis 14:12ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు.
Genesis 24:10ఆ దాసుడు తన యజమానికి చెందిన పది ఒంటెలను తీసుకుని ప్రయాణమయ్యాడు. అలాగే తన యజమాని దగ్గర నుండి అనేక రకాలైన వస్తువులను బహుమానాలుగా తీసుకు వెళ్ళాడు. అతడు ప్రయాణమై వెళ్ళి + 24:10 అంటే మెసపుటేమియా. ప్రస్తుత ఇరాక్ ప్రాంతం.ఆరాం నహరాయిము ప్రాంతంలో ఉన్న నాహోరు పట్టణం చేరాడు.
Genesis 27:43కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో.
Genesis 29:4యాకోబు వారిని చూసి “సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?” అని అడగ్గా వారు “మేము హారాను వాళ్ళం” అన్నారు.