Genesis 2:23
ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. 1 మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.
Cross References
Judges 9:2“మీరు దయ చేసి షెకెము నాయకులందరూ వినేలా వాళ్ళతో మాట్లాడండి, మీకేది మంచిది? యెరుబ్బయలు కొడుకులు డెబ్భైమంది మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? ఒక్కడు మిమ్మల్ని ఏలుబడి చేయడం మంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకం చేసుకోండి” అని అన్నాడు.
2 Samuel 19:13తరువాత అమాశా దగ్గరికి మనుషులను పంపి “నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు గాక” అని చెప్పమన్నాడు.
Ephesians 5:28అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.