Genesis 4:26
షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను + 4:26 అక్షరాలా యెహోవా పేరెత్తి పిలవడం మొదలు పెట్టారు.ఆరాధించడం ఆరంభించారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 12:8అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
Deuteronomy 26:17యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు.
Psalms 116:17నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను 1
Isaiah 48:1యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. 1 నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. 1 నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. 1 ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. 1 అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు. 1
Jeremiah 33:16ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”
Zephaniah 3:9అప్పుడు మనుషులంతా యెహోవా నామాన్ని బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించేలా నేను వారికి పవిత్రమైన పెదవులనిస్తాను.