Genesis 49:6
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
5షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. 1
Cross References
Genesis 34:30అప్పుడు యాకోబు షిమ్యోనునూ లేవినీ పిలిచి “మీరు ఈ దేశంలో నివసించే కనానీయులూ పెరిజ్జీయులూ నన్ను అసహ్యించుకొనేలా చేశారు. నా ప్రజల సంఖ్య తక్కువే. వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు. నేను, నా ఇంటివారు నాశనమవుతాం” అన్నాడు.
Judges 5:21కీషోను వాగులో, పురాతన వాగైన కీషోనులో వాళ్ళు కొట్టుకుపోయారు. 1 నా ప్రాణమా, నువ్వు బలం తెచ్చుకుని సాగిపో! 1
Psalms 5:10దేవా, వాళ్ళను అపరాధులుగా ప్రకటించు. వాళ్ళ పథకాలే వాళ్ళ పతనానికి కారణం అగు గాక! అసంఖ్యాకమైన వారి అతిక్రమాలనుబట్టి వాళ్ళను తరిమి కొట్టు. ఎందుకంటే వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు. 1
Psalms 26:4మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను. 1
Psalms 28:3దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు. 1
Psalms 42:5నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను. 1