Hosea 10:13
నీవు దుర్మార్గం అనే పంటకోసం దుక్కి దున్నావు. పాపమనే కోత కోసుకున్నావు. ఎందుకంటే నీ పథకాలపై ఆధారపడ్డావు. నీకున్న అసంఖ్యాకమైన సైనికులను నమ్ముకున్నావు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 24:14ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకోవాలని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముతున్నాడు? చచ్చిన కుక్కనా? పురుగునా?
Psalms 33:16ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు. 1
Psalms 62:10బలాత్కారంలో, దోచుకోవడంలో నమ్మకం పెట్టుకోవద్దు. ఐశ్వర్యంలో వ్యర్ధంగా మనసు నిలపవద్దు. ఎందుకంటే అవేవీ ఫలించవు. 1
Proverbs 12:19నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.
Proverbs 19:5అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.
Ecclesiastes 9:11నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, 2 వేగం గలవారు పరుగులో గెలవరు. 2 బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. 2 తెలివైన వారికి ఆహారం లభించదు. 2 అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. 2 జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. 2 ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి. 2