Hosea 4:3
కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది. దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు. సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 33:9దేశం దుఖిస్తుంది. క్షీణించి పోతుంది. లెబానోను కలవరపడి వాడిపోతుంది. 1 షారోను ఎడారిలా ఉంది. బాషాను, కర్మెలు తమ చెట్ల ఆకులు రాలుస్తున్నాయి. 1
Jeremiah 4:27యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను.
Jeremiah 9:9ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా? 1 ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు. 1
Ezekiel 38:20సముద్రపు చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమిమీద పాకే పురుగులన్నీ, భూప్రజలంతా నాకు భయపడి వణుకుతారు. పర్వతాలు నాశనమౌతాయి, కొండ శిఖరాలు కూలిపోతాయి, గోడలన్నీ నేలకూలుతాయి.
Amos 1:2అతడు ఇలా చెప్పాడు, “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.” 1 జాతుల పై తీర్పు
Amos 8:8దీన్ని బట్టి భూమి కంపించదా? 2 అందులో నివసించే వారంతా దుఃఖపడరా? 2 నైలునది లాగా అదంతా పొంగుతుంది. 2 ఐగుప్తుదేశపు నదిలాగా 2 అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.