Hosea 6:5
కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 18:25నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”
1 Samuel 15:22అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం.
1 Kings 17:1గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.
1 Kings 19:17హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు.
2 Chronicles 21:12ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది. “నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాల్లో గానీ యూదారాజు ఆసా మార్గాల్లో గానీ నడుచుకోకుండా
Job 34:10విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం. 1