Isaiah 10:3
తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 28:49దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.
2 Kings 7:15సిరియా సైన్యం కోసం యొర్దాను నది వరకూ వెళ్ళారు. సిరియా సైన్యం పారిపోతూ ఆ హడావుడిలో దారి పొడుగునా బట్టలూ, ఇతర సామగ్రీ పారేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి వార్తాహరులు తిరిగి వెళ్ళి రాజుకు ఆ సమాచారం ఇచ్చారు.
Psalms 49:16ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం + 49:16 ప్రభావం సంపద అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు. 1
Isaiah 2:20ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు. 1 ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు. 1
Isaiah 5:26ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. 1 భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. 1 అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు. 1
Isaiah 26:21ఎందుకంటే చూడండి! యెహోవా తన నివాసం నుండి రాబోతున్నాడు. భూమిపైన ప్రజలు చేసిన అపరాధాలకై వాళ్ళని శిక్షించడానికి వస్తున్నాడు. 1 భూమి తనపై జరిగిన రక్తపాతాన్ని బహిర్గతం చేస్తుంది. వధకు గురైన వాళ్ళని ఇక దాచి పెట్టదు.”