Isaiah 2:5
యాకోబు వంశస్థులారా, రండి. 1 మనం యెహోవా వెలుగులో నడుద్దాం. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
O house of Jacob, come ye, and let us walk in the light of the LORD.
In Context
Cross References
Psalms 89:15నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు. 1
Isaiah 2:3అనేక మంది వచ్చి ఇలా అంటారు. 1 “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు, 1 ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా, 1 యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.” 1 ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది. 1
Isaiah 58:1పెద్దగా కేకలు వెయ్యి. ఆపవద్దు. బూరలాగా నీ గొంతెత్తు. 1 వారు చేసిన తిరుగుబాటు నా ప్రజలకు తెలియజెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియజెయ్యి. 1
Isaiah 60:19ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. 1 వెన్నెల నీ మీద ప్రకాశింపదు. 1 యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ. 1
John 12:35అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.
Ephesians 5:8గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.