Isaiah 24:7
కొత్త ద్రాక్షారసం అంగలారుస్తున్నది. ద్రాక్షావల్లి వాడి పోతున్నది. ఆనంద హృదయులంతా నిట్టూర్పు విడుస్తున్నారు. తంబురల సంతోషనాదం నిలిచిపోయింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The new wine mourneth, the vine languisheth, all the merryhearted do sigh.
In Context
8కేరింతలు కొట్టే వారి ధ్వని మానిపోయింది. సితారాల ఇంపైన సంగీతం ఆగి పోయింది. 1
Cross References
Isaiah 16:10ఆనంద సంతోషాలు ఫలభరితమైన పొలాల నుంచి అదృశ్యం అవుతాయి. నీ ద్రాక్షల తోటలో సంగీతం వినిపించదు. ఉత్సాహ ధ్వని వినబడదు. గానుగుల్లో ద్రాక్షగెలలను తొక్కేవాడు లేడు. ద్రాక్షల తొట్టి తొక్కేవారి సంతోషభరితమైన కేకలు నేను నిలుపు చేశాను. 1
Isaiah 32:10మరో సంవత్సరం, కొద్ది రోజులకి మీ నమ్మకం వీగిపోతుంది. 1 నిశ్చింతగా ఉన్న స్త్రీలూ, ద్రాక్షపంట నష్టమౌతుంది. ద్రాక్షపళ్ళు ఇంటికి రావు. 1
Ezekiel 6:14నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.”
Joel 1:10పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. 1 ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. 1 నూనె ఒలికి పోయింది. 1