Isaiah 27:10
అలాగే ప్రాకారాలున్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. నివాస స్థలాలు మనుషులు లేని అరణ్యాల్లా మారతాయి. అక్కడ దూడలు మేస్తాయి. అవి అక్కడే పడుకుని చెట్ల కొమ్మలను తింటాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 5:9నేను చెవులారా వినేలా సేనల ప్రభువు యెహోవా స్పష్టంగా ఈ మాట నాకు చెప్పాడు. 1 నిజంగా గొప్పవి, అందమైన చాలా ఇళ్ళు వాటిలో నివాసముండే వారు లేక పాడైపోతాయి. 1
Isaiah 7:25ముళ్ళతుప్పల, బ్రహ్మ జెముడు చెట్ల భయం వల్ల మునుపు పారతో తవ్వి సాగు చేసిన కొండల వైపుకు మనుషులు పోరు. 1 అది పశువులు, గొర్రెలు పచ్చిక మేసే చోటుగా ఉంటుంది.”
Isaiah 17:9ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల భయం వల్ల వాళ్ళు వదిలి వెళ్ళిన బలమైన పట్టణాలు కొండ శిఖరాల పైన నిర్జనమైన అడవుల్లా ఉంటాయి. అవి నాశనమై పోతాయి. 1
Isaiah 25:2నీవు శత్రువుల నగరాన్ని దిబ్బగా చేశావు. ప్రాకారాలున్న పట్టణాన్ని శిథిలంగా చేశావు. అన్యుల కోటను పట్టణంగా మళ్ళీ ఉండకుండా చేశావు. అది మళ్ళీ ఎప్పుడూ నిర్మాణం కాకుండా చేశావు. 1
Isaiah 64:10నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి. 1 సీయోను బీడయింది. యెరూషలేము పాడుగా ఉంది. 1
Jeremiah 26:18“యూదా రాజు హిజ్కియా రోజుల్లో మోరషు ఊరివాడు మీకా ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు. సేనల అధిపతి యెహోవా చెప్పేదేమిటంటే, సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది. మందిరమున్న పర్వతం అరణ్యంలోని కొండలాగా అవుతుంది.