Isaiah 33:8
రాజమార్గాలు నిర్మానుష్యమై పోయాయి. వాటి మీద ప్రయాణీకులు ఎవ్వరూ లేరు. 1 సంధి ఒప్పందాలను ఉల్లంఘించారు. సాక్షులను అలక్ష్యం చేశారు. పట్టణాలను అవమానపరిచారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
7వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు. 1
Cross References
Leviticus 26:22మీ మధ్యకు క్రూరమృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను ఎత్తుకుపోతాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తాయి. మీ దారులు నిర్మానుష్యమై పోతాయి.
1 Samuel 17:10ఆ ఫిలిష్తీయుడు ఇంకా ఇలా అన్నాడు. “ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల సైన్న్యాన్ని సవాలు చేస్తున్నాను. మీ నుండి ఒకరిని పంపితే వాడూ నేనూ పోరాడతాం” అంటూ రంకెలు వేశాడు.
2 Kings 18:13హిజ్కియా రాజు పరిపాలనలో 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారాలున్న పట్టాణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు.
Psalms 10:5అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు. 1
Isaiah 10:13ఎందుకంటే అతడు, 1 “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను. 1
Isaiah 35:8పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. 1 దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు. 1