Isaiah 56:10
వారి కాపలాదారులంతా గుడ్డివాళ్ళు. వాళ్ళంతా తెలివితక్కువ వాళ్ళు. వాళ్ళంతా మొరగలేని మూగకుక్కలు. 1 పడుకుని కలలు కంటారు. నిద్ర అంటే వారికి చాలా ఇష్టం. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
9మైదానాల్లోని జంతువులన్నీ! అడవిలోని క్రూర జంతువులన్నీ! రండి! తినండి! 1
Cross References
Proverbs 6:4నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.
Isaiah 29:10ఎందుకంటే యెహోవా మీ మీద గాఢమైన నిద్రాత్మను కుమ్మరించాడు. ఆయన మీ కళ్ళు మూసివేశాడు. అంటే మీకు ప్రవక్తలను లేకుండా చేశాడు. మీ తలలకు ముసుగు వేశాడు. మీకు నాయకులను లేకుండా చేశాడు. 1
Isaiah 58:1పెద్దగా కేకలు వెయ్యి. ఆపవద్దు. బూరలాగా నీ గొంతెత్తు. 1 వారు చేసిన తిరుగుబాటు నా ప్రజలకు తెలియజెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియజెయ్యి. 1
Jeremiah 14:13అందుకు నేనిలా అన్నాను “అయ్యో, యెహోవా ప్రభూ! ‘మీరు కత్తి చూడరు. మీకు కరువు రాదు. ఈ స్థలంలో నేను స్థిరమైన భద్రత మీకిస్తాను’ అని ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెబుతున్నారు.”
Ezekiel 3:15అలా నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలానికి వెళ్ళాను. అక్కడ బందీలుగా వచ్చిన కొందరు నివాసముంటున్నారు. అక్కడే నేను ఏడు రోజులు దిగ్భ్రమతో నిండి ఉండిపోయాను.
Ezekiel 13:16సున్నం వేసిన వాళ్ళు ఎవరంటే యెరూషలేముకి శాంతి లేకున్నా యెరూషలేముకి శాంతి కలుగుతుందని దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తలే. ఇదే ప్రభువైన యెహోవా పలికిన మాట.”