Isaiah 60:5
నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 33:19వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. 1 అక్కడ సరైన బలులు అర్పిస్తారు. 1 వారు సముద్రాల సమృద్ధినీ 1 సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. 1
Psalms 34:5ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు. 1
Psalms 98:7సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక! 1
Isaiah 24:14శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు. 1
Isaiah 60:11రాజ్యాల సంపద నీదగ్గరికి తెచ్చేలా నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్లు మూసివేయడం జరగదు. 1 ఆ ప్రజల ఊరేగింపులో వారి రాజులు ఉంటారు. 1
Isaiah 66:12యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను. 1 రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను. 1 మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు. 1