Isaiah 62:5
యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు + 62:5 నీ కొడుకులు నీ సృష్టికర్త నిన్ను పెళ్లి చేసుకుంటారు. 1 పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Song of Solomon 3:11(యువతి యెరూషలేము స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) సీయోను ఆడపడుచులారా, బయటికి వెళ్లి కిరీటం ధరించిన సొలొమోనురాజును కన్నుల పండగగా చూడండి. 1 అతని పెళ్లి రోజున అతని తల్లి అతనికి ఆ కిరీటం పెట్టింది. అది అతనికి ఎంతో ఆనందకరమైన రోజు.
Isaiah 62:4నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు. 1 దాని బదులు నిన్ను “ప్రియమైనది + 62:4 ప్రియమైనది హెప్సీబా” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి + 62:4 కళ్యాణి బ్యూలా” అనీ అంటారు. 1 ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది. 1
Jeremiah 32:41వాళ్లకు మంచి చెయ్యడంలో ఆనందిస్తాను. నా నిండు హృదయంతో, నా ఉనికి అంతటితో కచ్చితంగా ఈ దేశంలో వాళ్ళను నాటుతాను.”
Zephaniah 3:17నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిశాలి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు. నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు.
Hebrews 12:2మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు. 1 తండ్రి ఇచ్చే శిక్ష