Isaiah 63:1
ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? 1 రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? 1 నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి? 1
Cross References
Genesis 49:11ద్రాక్షావల్లికి తన గాడిదనూ, 1 మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, 1 ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు. 1
1 Chronicles 1:44బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు.
Psalms 45:3బలశాలీ, నీ నడుముకు కత్తిని ధరించు. నీ తేజస్సునూ నీ ప్రభావాన్నీ ధరించుకో. 1
Psalms 65:6బలాన్నే నడికట్టుగా కట్టుకుని నీ శక్తితో పర్వతాలను స్థిరపరచింది నువ్వే. 1
Song of Solomon 3:6[మూడవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 ధూమ స్తంభంలాగా ఎడారి దారిలో వచ్చేది ఏంటది? బోళం, సాంబ్రాణి పరిమళాలతో వర్తకులమ్మే రకరకాల సుగంధ చూర్ణాలతో గుబాళిస్తూ వచ్చేది ఎవరు? 1
Song of Solomon 8:5[ఆరవ భాగం-ముగింపు] 1 (యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు) 1 తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను. 1 అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది.