Isaiah 65:11
అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 32:17వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. 1 తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, 1 మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు. 1
1 Chronicles 28:9సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.
Isaiah 1:28అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు. 1 యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు. 1
Isaiah 11:9నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. 1
Isaiah 57:5సింధూర వృక్షాల కింద, పచ్చని ప్రతి చెట్టు కింద, కామంతో రగిలిపోయే మీరు, 1 లోయల్లో రాతిసందుల కింద, మీరు మీ పిల్లలను చంపుతున్నారు. 1
Isaiah 65:25తోడేళ్లు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. సింహం ఎద్దులాగా గడ్డి తింటుంది. పాము మట్టి తింటుంది. 1 నా పవిత్ర పర్వతమంతట్లో అవి హాని చేయవు. నాశనం చేయవు” అని యెహోవా చెబుతున్నాడు.