Isaiah 65:2
మూర్ఖంగా ఉండే ప్రజలకోసం రోజంతా నా చేతులు చాపాను. 1 వాళ్ళు తమ ఆలోచనలననుసరిస్తూ చెడు దారిలో నడుస్తూ ఉన్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
3తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు. 1 వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు. 1
Cross References
Numbers 15:39మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.
Deuteronomy 29:19అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ ‘నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది’ అనుకుంటాడు.
Psalms 36:4వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు. 1
Psalms 81:11అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు. 1
Proverbs 16:29దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.
Isaiah 1:23నీ అధికారులు ద్రోహులు. 1 వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. 1 అందరూ లంచం ఆశిస్తారు. 1 చెల్లింపుల వెంటబడతారు. 1 తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. 1 వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు. 1