Isaiah 66:19
నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 10:4యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
1 Chronicles 1:7యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
1 Chronicles 16:24అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. 2 సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి. 1
Isaiah 2:16తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు. 1
Isaiah 18:3ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు 1 పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి! 1
Isaiah 24:15దాన్ని బట్టి తూర్పు ప్రాంతీయులారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి. 1