Jeremiah 11:2
“మీరు ఈ నిబంధన మాటలు వినండి. యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
3ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ నిబంధన మాటలు వినని వాడు శాపానికి గురౌతాడు.
Cross References
2 Kings 11:17అప్పుడు యెహోయాదా “ప్రజలు యెహోవాకి చెందిన వారు” అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు.
2 Chronicles 23:16వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు.
2 Chronicles 34:31రాజు తన స్థలం లో నిలబడి, ఆయనను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలనూ శాసనాలనూ కట్టడలనూ పూర్ణమనస్సుతో పూర్ణహృదయంతో అనుసరిస్తూ ఈ గ్రంథంలో రాసిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తిస్తానని యెహోవా ముందు నిబంధన చేసుకున్నాడు.
Jeremiah 34:13“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, దాస్య గృహమైన ఐగుప్తుదేశం నుంచి నేను మీ పితరులను తీసుకొచ్చిన రోజు వాళ్ళతో ఈ ఒప్పందం చేశాను.