Jeremiah 13:27
నీ వ్యభిచారం, కామంతో కూడిన నీ సకిలింపులు నీ జార కార్యాలు నాకు తెలుసు. 1 పొలాల్లోని ఉన్నత స్థలాల్లో నీవు చేసిన అసహ్యమైన కార్యాలు నాకు కనబడుతున్నాయి. 1 యెరూషలేమా, నీకు శ్రమ. నిన్ను నువ్వు పవిత్ర పరచుకోవడం లేదు. ఇలా ఎంత కాలం కొనసాగుతుంది?
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
26కాబట్టి మీకు సిగ్గు కలిగేలా నేను మీ బట్టల అంచులను లేపి మీ ముఖం మీద పడేలా చేస్తాను. 1
Cross References
Psalms 94:8బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు? 1
Isaiah 57:7ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు. 1 బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు. 1
Jeremiah 2:20పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు. 1 ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు. 1
Jeremiah 3:6యోషీయా రాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు. 1 “ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూశావా? ఆమె ఎత్తయిన ప్రతి కొండమీదికీ పచ్చని ప్రతి చెట్టు కిందికీ వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది. 1
Jeremiah 4:14యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?
Jeremiah 5:8బాగా బలిసిన గుర్రాల్లాగా వారిలో ప్రతి ఒక్కడూ ఇటూ అటూ తిరుగుతూ తన పొరుగువాని భార్యను చూసి సకిలిస్తాడు. 1